ఒకే కాన్పులో ముగ్గురు శిశువుల జననం

సంగారెడ్డిలోని కోమల్ జనని హాస్పిటల్‌లో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించడం విశేషంగా నిలిచింది. జనని హాస్పిటల్ డాక్టర్ కోమల్ జీత్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, వైద్యం అందించడంతో ముగ్గురు పిల్లలు సురక్షితంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్లను ధైర్యంగా నిర్వహించిన ఆమె పై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇద్దరు ఆడ శిశువులు, ఒక మగ శిశువు జన్మించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తల్లి, ముగ్గురు శిశువులు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕