సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహబూబ్ సాగర్ చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పైకి తేలింది. సుమారు 45 సంవత్సరాల వయసున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పట్టణ సీఐ రామునాయుడు కథనం మేరకు వివరాలు వెల్లడయ్యాయి.