సంగారెడ్డి పట్టణంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రెండు గంటలకు పైగా భారీ వర్షం కురవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పోతేపల్లి చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు ప్రధాన రహదారి జలమయమైంది. భారీ వర్షం కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. మున్సిపల్ సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు.