ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకాని 17 మంది జిల్లా అధికారులకు కలెక్టర్ ప్రావీణ్య బుధవారం నోటీసులు జారీ చేశారు. ప్రజావాణి కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేదు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. సరైన వివరణ ఇవ్వకుంటే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.