సదాశివపేట: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

సదాశివపేట మండలం నాగ్సన్ పల్లి జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశం తెలిపారు.

సంబంధిత పోస్ట్