సంగారెడ్డి: యాక్సిడెంట్‌లో విరిగిన కాలు!

శనివారం సాయంత్రం ఇస్మాయిల్ ఖాన్‌పేట గ్రామ శివారులోని బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి కిందపడటంతో సాయి కుమార్ (30) అనే యువకుడికి ఎడమ కాలికి తీవ్ర గాయమై, కాలు విరిగింది. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది స్రవంతి, పైలట్ రమేష్ ఘటనాస్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం బాధితుడిని సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్