సంగారెడ్డి: దంపతుల ఆత్మహత్య కేసు.. 24 గంటల్లో ఛేదించిన పోలీసులు

శంకర్ పల్లి మండలం జన్వాడ గ్రామంలో దంపతుల ఆత్మహత్య కేసును మోకిలా పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ప్రేమ వివాహం చేసుకున్న బాలసాయి చారి (32), పద్మ (25) దంపతులు, నిధి ఉందని చెప్పి మోసపోయి అప్పులు చేసి, తిరిగి చెల్లించలేక తీవ్ర మనస్తాపంతో ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడి సోదరుడు అరవింద్ ఫిర్యాదు మేరకు, పోలీసులు బాలసాయి చారి అత్త శాంతమ్మ, మామ చంద్రయ్య, తోటి అల్లుడు వెంకటేష్‌లను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జూలకల్ గ్రామానికి చెందినది.

సంబంధిత పోస్ట్