సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భముగా విద్యార్థులకు అందిస్తున్న విద్య, ఆహారం, తదితర అంశాలపై కలెక్టర్ పరిశీలించారు. తరగతిలో విద్యార్థులతో కలిసి కూర్చుని ఉపాధ్యాయురాలు బోధించే విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. తాను కూడా విద్యార్థులకు డిజిటల్ తరగతిని బోధించారు. విద్యార్థుల మేధస్సును వెలికితీయడం కోసం డిజిటల్ పాఠాలు కీలకమని తెలిపారు. ఉపాధ్యాయులు ఈ దిశగా కృషి చేయాలని సూచించారు.