సంగారెడ్డి: ఏప్రిల్ రెండవ తేదీన జాబ్ మేళా

సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని పాత డిఆర్డిఏ కార్యాలయంలో ఏప్రిల్ 2వ తేదీన ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించబడుతుంది. డిఆర్డివో జ్యోతి తెలిపిన వివరాల ప్రకారం, పదవ తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతీ యువకులు ఈ మేళాకు అర్హులు. ఎంపికైన వారికి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. అభ్యర్థులు తమ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డుతో హాజరుకావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్