సంగారెడ్డి: వర్క్ షాప్‌లో టైర్ పేలి.. ఒకరు మృతి

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్తంగిలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ టైర్ రిట్రేడింగ్ వర్క్ షాప్‌లో డై బ్లాస్ట్ (పేలుడు) సంభవించింది. ఆ సమయంలో అక్కడ ముగ్గురు వ్యక్తులు ఉండగా, వర్క్ షాప్‌ను సందర్శించడానికి వచ్చిన ఒకరు ఆ తీవ్రతకు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్