సంగారెడ్డి జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఏడుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ పరితోష్ పంకజ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సైలు ప్రసాద్ రావు, కాశీనాథ్, విశ్వజన్, వెంకట రెడ్డి, పాటిల్ క్రాంతికుమార్, కోటేశ్వర్ రావు, శంకరయ్య బదిలీ అయ్యారు. వీరందరూ తక్షణమే విధులో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.