సంగారెడ్డి జిల్లా కంగ్జి మండలంలోని చౌకన్పల్లి గ్రామంలో మంగళవారం ఆరేళ్ల బాలిక శైలజ వడదెబ్బతో మృతి చెందింది. ఉపాధి హామీ పనులకు తల్లిదండ్రులతో పాటు వెళ్లిన బాలిక, ఎండ తీవ్రతను తట్టుకోలేక నీరసించిపోయింది. పనులు జరుగుతున్న చోట సరైన నీడ సదుపాయం లేకపోవడం ఈ విషాదానికి కారణమైంది. రాత్రి తల్లిదండ్రుల పక్కన నిద్రపోయిన శైలజ, తెల్లవారుజామున మృతి చెందింది. ఈ ఘటనపై ఏపీఓ బసవరాజును 'దిశ' ప్రతినిధి ప్రశ్నించగా, చిన్నారి వడదెబ్బతో మృతి చెందిన విషయం తమ దృష్టికి రాలేదని తెలిపారు.