మునిపల్లి మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య బ్యాంకు పని నిమిత్తం బుధేరాకు వచ్చారు. టీ తాగుతుండగా జాతీయ రహదారి మీదుగా వచ్చిన పాము అతని కారు ఇంజిన్‌లోకి దూరింది. స్థానికులు గంటపాటు ప్రయత్నించినా పాము బయటకు రాలేదు. సదాశిపేటకు చెందిన సద్దాం వచ్చి పామును బయటకు తీశారు. ఇంజిన్ వేడికి అచేతనంగా మారిన పాముకు నీళ్లు పోసి ఉపశమనం కలిగించి, అటవీప్రాంతంలో వదిలేశారు. దీంతో కారులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.