సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. హైదరాబాద్ వెళ్తున్న ఎలక్ట్రికల్ బస్సు ముంబాయి జాతీయ రహదారి ఇస్నాపూర్ వద్ద యూటర్న్ తీసుకుంటుండగా, సంగారెడ్డి డిపో నుంచి వచ్చిన బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలవగా, పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండు బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి.