పటాన్ చెరు పారిశ్రామిక వాడలోని పార్కర్ పరిశ్రమలో పనిచేస్తున్న కుమ్మరి కుమార్ (48) అనే కాంట్రాక్టు కార్మికుడు మంగళవారం ఉదయం డ్యూటీలో ఉండగా అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. ఆరు నెలలుగా పార్కర్ పరిశ్రమలో పనిచేస్తున్న మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న బంధువులు యాజమాన్యం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కంపెనీ వద్ద ఆందోళనకు దిగారు.