సిద్దిపేట: డిప్యూటీ సీఎంకు హరీష్ రావు లేఖ

సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 9 నెలలుగా వేతనాలు అందలేదని, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ నేపథ్యంలో, డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు ఆయన లేఖ రాసి, వెంటనే వేతనాలు చెల్లించాలని కోరారు. పండుగల సమయంలో కూడా కనికరం చూపలేదని, సంక్రాంతికైనా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్