సిద్దిపేట: రోడ్డు ప్రమాదంలో మృతుడి గుర్తింపు

చేర్యాల మండలం ముస్త్యాల ఎల్లమ్మ గుడి వద్ద నిన్న జరిగిన ప్రమాదంలో మృతుడు సిద్దిపేటలోని హనుమాన్ నగర్‌కు చెందిన చింతల వెంకటేష్(38)గా పోలీసులు గుర్తించారు. తన టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వెంకటేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అపూర్వ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్