సిద్దిపేట: ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో శనివారం ఉదయం రాజస్థాన్‌కు చెందిన జెటా రామ్ అనే వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో బెజ్జంకిలో హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగించిన ఆయన, ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో హోటల్ నడుపుతున్నట్లు తెలిసింది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్