సిద్దిపేట: ఇంట్లోనే చోరీ చేసిన కొడుకు

సిద్దిపేటలో అనారోగ్యంతో తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, అతని పెద్ద కొడుకే ఇంట్లో దొంగతనానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. పక్షవాతంతో బాధపడుతున్న తండ్రి సాయి చరణ్ దాస్ ఆసుపత్రిలో ఉండగా, ఒంటరిగా ఉంటున్న పెద్ద కుమారుడు ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు రూ.27.45 లక్షల నగదు, 5 లక్షల విలువైన బంగారు నగలను అపహరించుకుపోయాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్