సిద్దిపేట: జంట హత్య కేసులో ట్విస్ట్

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వడ్లూరులో జరిగిన జంట హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తల్లిని, కొడుకును హత్య చేసి అనంతరం ఉరివేసుకొని మృతి చెందిన జక్కని సత్తయ్య ఉపయోగించిన మారణాయుధం కోసం పోలీసులు శనివారం రాత్రి సిద్దిపేట నుంచి జాగిలాన్ని తెప్పించి విస్తృతంగా గాలింపు చేపట్టారు. అయితే ఇప్పటివరకు ఆయుధం లభించలేదు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్