బెజ్జంకి: బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ బుధవారం గుగ్గిళ్ల గ్రామానికి చెందిన తిప్పరవేణి రాజయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యం కల్పించారు. ఇటీవల మృతి చెందిన రాజయ్య కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ముక్కీస రత్నాకర్ రెడ్డి, గుగ్గిళ్ల గ్రామశాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్