రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్న బీఆర్ఎస్ నాయకులు

పదేళ్లు అధికారంలో ఉండి రైతులను విస్మరించిన బీఆర్ఎస్ పార్టీ, అధికారం కోల్పోయాక రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తోందని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ ఆరోపించారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను ఆయన ఖండించారు. మక్క రైతులకు గన్నీ బ్యాగులు సరిపడా లేవని రైతులు తమ దృష్టికి తీసుకురాగానే, వెంటనే ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లగా, మార్కెట్ ఫెడ్ డీఎంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్