పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ కొండంత అండ.. ఉపసర్పంచ్

సిద్దిపేట జిల్లా, అక్బర్ పేట భూంపల్లి మండలం, చిట్టాపూర్ గ్రామానికి చెందిన మంతూరి లక్ష్మికి, ఆమె భర్త మల్లయ్య వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నుండి రూ. 21 వేల చెక్కును గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఉపసర్పంచ్ దోర్నాల యాదగిరి అందజేశారు. పేద ప్రజల ఆరోగ్య భద్రతకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కొండంత అండగా నిలుస్తుందని యాదగిరి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు రెడ్డి బాల్ నరసింహులు, ముఖ్య నాయకులు రెడ్డి రమేష్, తీగల స్వామి, రెడ్డి రవి, మంగళి మురళి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕