సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ, ఇటీవల విడుదలైన టిఎస్ పిఎస్సి గ్రూప్-3 పరీక్షల్లో ఆడిటర్‌గా ఎంపికైన ఎర్రవల్లి సందీప్ రెడ్డిని టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఉపేందర్ ప్రత్యేకంగా అభినందించారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూనే, పట్టుదలతో చదివి ఉన్నత ఉద్యోగాన్ని సాధించడం అభినందనీయమని ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డిని శాలువాతో సత్కరించి, సిద్దిపేట పోలీస్ యూనిట్ నుండి ఆయనను విధులకు రిలీవ్ చేశారు.