సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం భూంపల్లి గ్రామంలో మిరుదొడ్డి మండల ఏఎంసీ చైర్మన్ సంయుక్త శ్రీధర్ గారి ఆధ్వర్యంలో 157వ గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంయుక్త శ్రీధర్ మాట్లాడుతూ అహింస మార్గంలో దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ మండల నాయకులు గుండా శంకర్, కమలాకర్, సురేందర్ రెడ్డి, మమ్ము, మండల కుమార్, ప్రతాప్ రెడ్డి, బాల్ రాజు, చందు తదితరులు పాల్గొన్నారు