అకాల వర్షాల వలన తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చెయ్యాలి

రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వలన తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, అన్ని కొనుగోలు కేంద్రాలలో ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ముఖ్య కార్యదర్శి రామక్రిష్ణ రావుతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి ఈ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 9214 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిందని, వెంటనే వాటిని కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్