ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రైవేట్ పాఠశాలలు నిర్వహించొద్దు

సిద్దిపేట అర్బన్ మండల విద్యాధికారి రాజప్రభాకర్ రెడ్డి ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రైవేట్ పాఠశాలలు నిర్వహించవద్దని హెచ్చరించారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అడ్మిషన్లు తీసుకోరాదని, పాఠశాలల పేర్లలో నేషనల్, ఇంటర్నేషనల్ వంటి పదాలను వాడరాదని సూచించారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ప్రచార హోర్డింగులు, ఫ్లెక్సీలు, బ్యానర్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్