సిద్దిపేట టూటౌన్ పోలీసులు ప్రేమ పేరుతో మైనర్ బాలికను వేధిస్తున్న బర్మా వెంకటేశ్ అనే పాత నేరస్తుడిని అరెస్ట్ చేశారు. గతంలో ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన బాలికను వేధించినందుకు వెంకటేశ్ కు గతంలో జైలుశిక్ష పడింది. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా నిందితుడి తీరు మారలేదు. బాలిక ఫొటోలను మార్ఫింగ్ చేసి, ఆమె స్నేహితులకు పంపించాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్ కు తరలించారు.