సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో పీజీ విద్యార్థులు స్థానిక పద్మ నర్సరీని సందర్శించారు. మొక్కల పెంపకం, శాఖీయ ప్రత్యుత్పత్తి పద్ధతుల ద్వారా వివిధ రకాల మొక్కల సాగు విధానాన్ని వారు తెలుసుకున్నారు. కళాశాలలోనూ అలంకరణ, ఔషధ మొక్కలను పెంచే ఆచరణాత్మక అంశాలను కొనసాగించాలని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సునీత నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. అయోధ్య రెడ్డి కూడా పాల్గొన్నారు.