టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి, ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, అసంబద్ధమైన సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని కోరారు. నూతన విద్యా విధానం 2020ని రద్దు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీలో ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని టీఎస్ యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో తెలియజేశారు.