సిద్ధిపేట: తప్పిపోయిన పాప.. బంధువులకు అప్పగించిన పోలీసులు

తప్పిపోయిన పాపను పోలీసులు వివరాలు తెలుసుకుని వారి బంధువులకు అప్పగించిన ఘటన సిద్దిపేటలో సోమవారం చోటు చేసుకుంది. పట్టణంలోని శంకర్ నగర్ లో ఆరె అర్జున్ తన భార్య, కూతురు దివ్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో పాప ఆడుకుంటూ ఇంటి నుంచి బయటకు వచ్చి బాలాజీ థియేటర్ సమీపంలో ఏడుస్తూ ఉండగా, గమనించిన ఓ వ్యక్తి టూటౌన్ పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లి అప్పగించాడు. వివరాలు తెలుసుకున్న పాప పెద్దనాన్నకు పోలీసులు అప్పగించారు.

సంబంధిత పోస్ట్