సిద్ధిపేట: రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి

2026లో జరగనున్న సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, చేర్యాల, హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలలో పోలింగ్ సిబ్బందిని రెండవ విడత ర్యాండమైజేషన్ పద్ధతిలో బుధవారం ఆన్లైన్లో కేటాయించారు. ఈ ప్రక్రియలో భాగంగా చేర్యాల మున్సిపాలిటీకి 122 మంది, హుస్నాబాద్కు 200 మంది, దుబ్బాకకు 205 మంది, గజ్వేల్ ప్రజ్ఞాపూర్కు 364 మంది సిబ్బందిని కేటాయించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని పారదర్శకంగా ఎంపిక చేసేందుకు ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టారు.

సంబంధిత పోస్ట్