కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డి మాట్లాడుతూ, పల్లె ప్రజల భాష తెలంగాణకు ఆత్మ లాంటిదని అన్నారు. సిద్దిపేట ఎంతో మంది గొప్ప వ్యక్తులను తయారు చేసిందని, తెలంగాణ గొంతుకై నిలిచిన గాయకులు, కళాకారులు, కవులను అందించి చైతన్యానికి ప్రతీకగా నిలిచిందని తెలిపారు. యువతరం పరిశోధన ఆసక్తిని పెంపొందించుకుని వీటిని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగుశాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు అంతర్జాలంలో నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వేముగంటి నరసింహాచార్యులు, కాపు రాజయ్య సిద్దిపేటకు రెండు కళ్లలాంటి వారన్నారు.