తెలంగాణ వార్డు సభ్యుల సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా కామేర తిరుమల లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. బుధవారం కరీంనగర్‌లో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అతికం రాజశేఖర్ గౌడ్ నియామక పత్రాన్ని అందజేశారు. వార్డు సభ్యుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా తీసుకుని నిరంతరం సేవ చేయాలని, సంఘాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర అధ్యక్షుడు సూచించారు. నూతన అధ్యక్షురాలు తిరుమల లక్ష్మీనారాయణ వార్డు సభ్యుల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. ఈ నియామకం సిద్దిపేటలో జరిగింది.