గురువారం సాయంత్రం బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో 60 ఏళ్ల బోనగిరి జనమ్మ అనే వృద్ధురాలు తన ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందడంతో కలకలం రేగింది. పని నుంచి ఇంటికి వచ్చిన భర్త పోషయ్య ఈ ఘటనను చూసి షాక్‌కు గురయ్యారు. మధ్యాహ్నం ఆమెను పంచాయతీ కార్యాలయానికి పిలిపించారని, ఆ తర్వాతే ఈ దుర్ఘటన జరిగిందని భర్త పోలీసులకు తెలిపారు. మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.