సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హుగ్గెల్లి వద్ద జాతీయ రహదారిపై తుపాన్ వాహనం బోల్తా పడింది. కర్ణాటకలోని ఔరాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా, వాహనం ముందు టైరు పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులతో సహా పది మందికి గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించగా, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో సంగారెడ్డి, హైదరాబాద్ ఆసుపత్రులకు తరలించారు.