కారు డివైడర్‌ను ఢీకొని ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు

జహీరాబాద్ పట్టణం పరిధిలోని బైపాస్ రోడ్డుపై కారు డివైడర్‌ను ఢీకొని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పలువురు గాయపడగా, ఒకరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి ముంబై వైపు వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్