అర్జున్ బండారి ఏకగ్రీవంగా అధ్యక్షులుగా ఎన్నిక కావడం హర్షణీయం

జహీరాబాద్ చేనేత సహకార సంఘం ఎన్నికల్లో బీజేపీ పార్టీ మద్దతుతో పోటీ చేసిన అర్జున్ బండారి ఏకగ్రీవంగా అధ్యక్షులుగా ఎన్నిక కావడం హర్షణీయమని బీజేపీ జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు పూల సంతోష్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర నాయకులు సుదీర్ బండారి తండ్రి అయిన అర్జున్ బండారి ఎన్నిక జహీరాబాద్ పట్టణంలో బీజేపీకి మరో ప్రతిష్ఠాత్మక విజయంగా నిలిచిందన్నారు. ఈ విజయం చేనేత కార్మికుల విశ్వాసానికి, బీజేపీ పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్