జహీరాబాద్ నిష్క్ కార్యాలయంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజు రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ సతీశ్, డ్రైవర్ దుర్గయ్యలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. భూ పరిహార ఫైల్ కోసం రూ. 65 వేలు డిమాండ్ చేశారు. డిప్యూటీ తహశీల్దార్ రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డ్రైవర్ దుర్గయ్య మరో అభ్యర్థి పనికి రూ. లక్ష డిమాండ్ చేశాడు. ముగ్గురిని అరెస్ట్ చేశారు.