AP: విశాఖలో మౌనిక హత్య కేసులో పోలీసుల విచారణ ముమ్మరమైంది. ధారపాలెం జీడి తోటలో సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. నిందితుడు రవీంద్రను ఘటనా స్థలానికి తీసుకెళ్లి హత్య జరిగిన తీరు వివరాలు రికార్డ్ చేశారు. మౌనిక శరీర భాగాలను తగులబెట్టిన ప్రాంతాన్ని క్లూస్ టీమ్ గుర్తించింది. సాక్ష్యాల ధ్వంసంపై నిందితుడి నుంచి కీలక సమాచారం సేకరించారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించగా, మొత్తం ప్రక్రియను పోలీసులు వీడియోగా రికార్డ్ చేస్తున్నారు.