వారంలో రూ.10,000 తగ్గిన వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వారం వ్యవధిలో తగ్గాయి. ఈ నెల 20న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,840 ఉండగా, రూ.3,160 తగ్గి.. ప్రస్తుతం రూ.1,52,680కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,900 తగ్గి రూ.1,39,950 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.10వేలు తగ్గి రూ.2,50,000గా ఉంది. ఈ ధరలపై 3 శాతం జీఎస్టీ అదనం.

సంబంధిత పోస్ట్

✕
✕