ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి సింధు

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో మూడో సీడ్‌ సింధు 21-6, 21-9తో చెన్‌ సుయు (చైనీస్‌ తైపీ)పై సునాయాసంగా గెలుపొందింది. ఇది ఈ సీజన్‌లో సింధుకు రెండో సెమీఫైనల్. మరోవైపు, యువ షట్లర్‌ తవెన్వ శర్మ టాప్‌సీడ్‌ అకానె యమగూచి చేతిలో ఓటమి పాలైంది. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో యమగుచితో సింధు పోటీపడనుంది. పురుషుల డబుల్స్‌లో భారత జోడీ మధ్యలోనే నిష్క్రమించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్