సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల హీరో బాలకృష్ణ సంతాపం తెలిపారు. ఆయన మరణం తనను తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. సింగీతం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సింగీతం శ్రీనివాస్ అసలు సిసలైన దిగ్గజ దర్శకుడని బాలయ్య కొనియాడారు. తామిద్దరం కలిసి 3 విభిన్నమైన క్లాసిక్ చిత్రాలను అందించామని గుర్తు చేసుకున్నారు. 'ఆదిత్య 369' తెలుగు సినిమా చరిత్రలోనే కొత్త ముద్ర వేసిందన్నారు.