TG: 'SIR'లో చాలా లోపాలు ఉన్నాయని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'నాక్కూడా నోటీసు వచ్చింది. చనిపోతే ఓటు తీసేయాలి. బదిలీ అయితే ఓటు బదిలీ కావాలి. కానీ, బీజేపీకి నచ్చని ఓట్లు తీసేస్తుంది. ఈడీ, సీబీఐని బీజేపీ వాడుకుంటోంది. అదే విధంగా ఇప్పుడు ఈసీని వాడుకుంటోంది. CEC నియామక ప్రక్రియను ఎందుకు మార్చారు?. కమిటీలో సీజేను లేకుండా ఎందుకు చేసింది?' అని ప్రశ్నించారు.