మల్యాల: మొక్కలను నాటిన బీజేపీ నాయకులు

మల్యాల మండలం నూకపెల్లి గ్రామంలో వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకులు శుక్రవారం మొక్కలను నాటారు. ప్రధానిగా మోదీ 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 11 రోజుల పాటు వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేటితో 10 రోజుల కార్యక్రమాలు పూర్తయ్యాయన్నారు. మొక్కలు నాటిన వారిలో కుడిదల రాజన్న, నులుగొండ సురేష్, హరికృష్ణ, శ్రీకాంత్, శశి కుమార్, శేఖర్, ప్రశాంత్, హన్మాండ్లు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్