ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంతో పాటు ఉప ఆలయాలలోను శనివారం భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు తలనీలాలు సమర్పించి కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పర్యవేక్షించారు.