బోయిన్పల్లి మండలం వెంకట్రావు పల్లి వద్ద సోమవారం సిరిసిల్ల డిపోకు చెందిన నాన్ స్టాప్ డీలక్స్ బస్సు అతివేగంగా వచ్చి రోడ్డు దాటుతున్న వెంకట్రావు పల్లి గ్రామానికి చెందిన రాగటి ఎల్లయ్య ను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు క్షతగాత్రుని 108 లో సిరిసిల్ల హాస్పిటల్ చికిత్స నిమిత్తం తరలించారు.