అంబానీ కుమారుడి పెళ్లి పత్రిక ఆధునికతకు, ఆడంబరానికి నిదర్శనంగా నిలవగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గుడివెలుగులపల్లి వెలిచాలకి చెందిన పోకల మధు పెళ్లి పత్రిక తెలంగాణ పల్లె యాస, భాషకు పట్టం కట్టింది. పల్లె యాస, భాషలో లగ్గం పిలుపు ప్రారంభించి మొత్తం పెళ్లి తంతుకు సంబంధించిన అన్ని పదాలను తెలంగాణ మాండలికంలోనే అచ్చు వేయించారు. ప్రస్తుతం ఈ లగ్న పత్రిక శుక్రవారం సోషల్ మీడియా వైరల్ గా అవుతోంది.