గంగాధర: పాదయాత్ర చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి

గంగాధర మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో జై భాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు బీజేపీ పాలకులకు తప్పకుండా బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్