మల్యాల: ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

మల్యాల మండలంలోని పలు ఆలయాలతో పాటు, కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కొండగట్టులో తెల్లవారుజామునే శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తిని ప్రత్యేక వేదికపై ప్రతిష్ఠించారు. అనంతరం ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి, భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. మల్యాల మార్కండేయ ఆలయంలో భక్తుల సందడి నెలకొంది.

సంబంధిత పోస్ట్